నటి, బీజేపీ నేత సోనాలి ఫోగట్ హఠాన్మరణం

  • గోవాలో ఉన్న ఆమెకు సోమవారం రాత్రి తీవ్ర గుండెపోటు
  • పలు సీరియళ్లు, సినిమాల్లో నటించిన సోనాలి
  • 2019 హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ
హర్యానా రాష్ట్ర బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ తీవ్ర గుండెపోటు కారణంగా సోమవారం రాత్రి హఠాన్మరణం చెందారు. తన సిబ్బందితో కలసి గోవాకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. బిగ్ బాస్ 14 కంటెస్టెంట్ గా ఆమెను ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆ తర్వాత ఆమెకు ఎంతో ప్రజాదరణ లభించింది. టిక్ టాక్ లోనూ ఆమె ఎంతో పాప్యులర్ స్టార్. 2019 హర్యానా ఎన్నికల్లో అదంపూర్ నుంచి బీజేపీ టికెట్ పై ఆమె రాష్ట్ర శాసనసభకు పోటీ చేసి ఓటమి చెందారు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కులదీప్ బిష్ణోయ్ పై అప్పట్లో ఆమె పోటీ చేశారు.

‘ఏక్ మా జో లాఖన్ కే లియే బని అమ్మ’ అనే టీవీ సీరియల్ లో 2016లో మొదటిసారిగా సోనాలి నటించింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో ఆమె నటించింది. 2016 డిసెంబర్ లో 42 ఏళ్ల భర్త సంజయ్ ఫోగట్ ను ఆమె కోల్పోయింది. వ్యవసాయ క్షేత్రంలో అనుమానాస్పద రీతిలో నాడు ఆయన మరణించారు. సోనాలికి ఒక కుమార్తె ఉంది.

Sonali Phogat
actress
BJP leader
died
gao
heart attack

More Telugu News